ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా రష్యన్ బృందం!

ABN , First Publish Date - 2022-02-27T19:03:19+05:30 IST

ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్

ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా రష్యన్ బృందం!

మాస్కో : ఉక్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న రష్యా మరోవైపు చర్చలకు తలుపులు తెరిచింది. అనేక ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తున్న తరుణంలో నాలుగో రోజున కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్ వెళ్ళినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. 


ఈ బృందంలో రష్యా విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కార్యాలయం అధికారులు ఉన్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన తర్వాత చర్చలకు సిద్ధమవడం ఇదే మొదటిసారి. రష్యన్ బృందం బెలారస్‌లోని గోమెల్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాక కోసం వేచి చూస్తోంది. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆదివారం కూడా కొనసాగుతోంది. కీవ్ నగరాన్ని కబళించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ గట్టిగా నిలువరిస్తోంది. ఉక్రెయిన్‌కు మిలిటరీ సహాయం అందజేస్తామని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. 



Updated Date - 2022-02-27T19:03:19+05:30 IST