ఫ్రాన్స్‌ను హెచ్చరించిన రష్యా

ABN , First Publish Date - 2022-03-02T07:54:30+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై

ఫ్రాన్స్‌ను హెచ్చరించిన  రష్యా

న్యూఢిల్లీ, మార్చి 1: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై  ఆర్థిక ఆంక్షలు విధించిన ఫ్రాన్స్‌ను రష్యా హెచ్చరించింది. ‘‘మేము రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం’’ అని ఫ్రెంచ్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లి మెయిర్‌ అన్నట్లు బీబీసీ న్యూస్‌ పేర్కొంది. దానికి రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రి మెద్వెదెవ్‌ స్పందించారు. ‘‘మీరు నోరు అదుపులో పెట్టుకోండి జంటిల్‌మేన్‌. మానవ చరిత్రలో ఆర్థిక యుద్ధాలు నిజమైన యుద్ధాలుగా మారిన విషయాన్ని మర్చిపోకండి’’ అని హెచ్చరించారు.


Updated Date - 2022-03-02T07:54:30+05:30 IST