గర్జిస్తున్న రష్యా.. నిలువెల్లా వణికిపోతోన్న ఉక్రెయిన్..

ABN , First Publish Date - 2022-02-25T16:41:20+05:30 IST

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం సాగిస్తోంది. రష్యా దాడికి ఉక్రెయిన్ వణికిపోతోంది.

గర్జిస్తున్న రష్యా.. నిలువెల్లా వణికిపోతోన్న ఉక్రెయిన్..

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం సాగిస్తోంది. రష్యా దాడికి ఉక్రెయిన్ వణికిపోతోంది. యుద్ధంపై తగ్గేది లేదని పుతిన్ స్పష్టం చేశారు. అయితే పుతిన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ... యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు.


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర లక్ష్యం దిశగా సాగుతోంది. యుద్ధం రెండో రోజునే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌గా చేసుకుని రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌ నగరం వైపునకు రష్యా బలగాలు దూసుకెళుతున్నాయి. కీవ్‌ సిటీకి 30 కిలోమీటర్ల దూరం వరకు రష్యా సైనిక దళాలు చేరుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రభుత్వం కీవ్‌ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మాస్కోతో పోరాటానికి కైవ్‌ మాత్రమే ఒంటరిగా మిగిలిందన్న ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్క్ వ్యాఖ్యలు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కీవ్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2022-02-25T16:41:20+05:30 IST