రష్యా దాడుల్లో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ దుర్మరణం

ABN , First Publish Date - 2022-03-14T00:25:08+05:30 IST

ఇర్పెన్: ఉక్రెయిన్‌లోని ఇర్పెన్‌లో రష్యా బలగాలు జరిపిన దాడుల్లో న్యూయార్క్ టైమ్స్‌ జర్నలిస్ట్ బ్రెంట్ రెనాడ్ దుర్మరణం పాలయ్యారు.

రష్యా దాడుల్లో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ దుర్మరణం

ఇర్పెన్: ఉక్రెయిన్‌లోని ఇర్పెన్‌లో రష్యా బలగాలు జరిపిన దాడుల్లో న్యూయార్క్ టైమ్స్‌ జర్నలిస్ట్ బ్రెంట్ రెనాడ్ దుర్మరణం పాలయ్యారు. మరో జర్నలిస్ట్ గాయపడ్డారని కీవ్ పోలీస్ చీఫ్ ఆండ్రివ్ నెబిటోవ్ తెలిపారు. బ్రెంట్ రెనాడ్ వయసు 51 సంవత్సరాలు. ఆయన మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి తరలించేందుకుు యత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై 17 రోజులైంది. వందలాది మంది చనిపోయారు. రెండు కోట్ల మంది విదేశాలకు వలసపోయారు.   

Updated Date - 2022-03-14T00:25:08+05:30 IST