ఐసీజే ఆదేశాలు తిరస్కరించిన రష్యా .. దాడులు ఉధృతం..

ABN , First Publish Date - 2022-03-17T23:29:03+05:30 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై తక్షణమే యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది.

ఐసీజే ఆదేశాలు తిరస్కరించిన రష్యా .. దాడులు ఉధృతం..

మాస్కో: ఉక్రెయిన్‌పై తక్షణమే యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఐసీజే ఆదేశాలను తాము పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి మూడు వారాలు గడుస్తున్నా మరింత భీకరంగా దాడులు చేస్తోంది. సుమీతో పాటు పలుచోట్ల దాడులకు పాల్పడుతోంది. సుమీలో రష్యా యుద్ధట్యాంక్ రెజిమెంట్ ప్రవేశించింది. ఇటు ఉక్రెయిన్ కూడా అమెరికా తాజాగా అందిస్తోన్న ఆయుధాల సహకారంతో రష్యాను ఢీకొంటోంది. రష్యా యుద్ధ ట్యాంకులను డ్రోన్ల సహకారంతో ధ్వంసం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేస్తోంది. 

Updated Date - 2022-03-17T23:29:03+05:30 IST