ఫ్రాన్స్‌కు షాక్ ఇచ్చిన రష్యా

ABN , First Publish Date - 2022-02-26T22:07:36+05:30 IST

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్

ఫ్రాన్స్‌కు షాక్ ఇచ్చిన రష్యా

మాస్కో : ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలపై రష్యా ప్రతిస్పందించింది. ఫ్రెంచ్ గుయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపేసింది. టెక్నికల్ సిబ్బందిని వెనుకకు రప్పిస్తున్నట్లు తెలిపింది. రష్యా రోదసీ సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ దిమిత్రీ రోగోజిన్ శనివారం ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. 


తమ సంస్థలపై యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలకు స్పందనగా  కౌరోవ్ కాస్మోడ్రోమ్‌ నుంచి అంతరిక్ష ప్రయోగాల నిర్వహణలో యూరోపియన్ భాగస్వాములతో సహకారాన్ని రోస్కోస్మోస్ నిలిపేస్తోందని తెలిపారు. ఫ్రెంచ్ గుయానా నుంచి కన్సాలిడేటెడ్ లాంచ్ క్రూతో సహా, టెక్నికల్ సిబ్బందిని ఉపసంహరించుకుంటోందన్నారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుండటంతో రష్యాపై కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని ఉక్రెయిన్ కోరింది. దీంతో యూరోపియన్ యూనియన్ దేశాలు స్పందించాయి. 

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు యూరోప్‌లో ఉన్న ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించాయి. 


Updated Date - 2022-02-26T22:07:36+05:30 IST