అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై పుతిన్ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-03-16T02:55:10+05:30 IST

మాస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆంక్షలు విధించారు. బైడెన్‌తో పాటు అమెరికా మంత్రులు ఆంటొనీ బ్లింకెన్, లయాడ్ ఆస్టిన్,

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై పుతిన్ ఆంక్షలు

మాస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆంక్షలు విధించారు. బైడెన్‌తో పాటు అమెరికా మంత్రులు ఆంటొనీ బ్లింకెన్, లయాడ్ ఆస్టిన్, సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్‌పై కూడా రష్యా ఆంక్షలు విధించింది. మరో పది మంది అమెరికా ప్రజాప్రతినిధులు, అధికారులపై కూడా రష్యా ఆంక్షలు విధించిందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలియజేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపధ్యంలో అమెరికా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై మార్చ్ 3న ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ యుద్ధంలో ఇప్పటివరకూ వందలాది మంది మరణించారు. రెండు కోట్ల మందికి పైగా పౌరులు పొరుగుదేశాలకు వలసపోయారు. 



Updated Date - 2022-03-16T02:55:10+05:30 IST