రష్యాలో కొత్తగా 6,615 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-12T23:41:05+05:30 IST

రష్యాలో కొత్తగా 6,615 కరోనా కేసులు నమోదు

రష్యాలో కొత్తగా 6,615 కరోనా కేసులు నమోదు

మాస్కో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రష్యా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రష్యా దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి కొత్తగా 6,615 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 727,162కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ -19తో 130 మంది మరణించారని, మరణాల సంఖ్య 11,335కు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. 501,061 మంది వైరస్ నుంచి కోలుకున్నారని రష్యా తెలిపింది.

Updated Date - 2020-07-12T23:41:05+05:30 IST