రష్యాలో 11 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-20T08:07:06+05:30 IST

రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా

రష్యాలో 11 లక్షలకు చేరువైన కరోనా కేసులు

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 6,065 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11 లక్షలకు చేరువైంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 10,97,251కు చేరింది. మొత్తం 84 రీజియన్ల నుంచి కొత్త కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ శనివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 1,460 మందికి ఎటువంటి కరోనా లక్షణాలు లేనట్టు పేర్కొంది. ఇక రష్యాలో అత్యధిక కరోనా కేసులు రాజధాని మాస్కో నుంచే నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో 825 కేసులు ఇక్కడే బయటపడ్డాయి.


మరోపక్క గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా కరోనా బారిన పడి 144 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 19,339కు చేరింది. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 9,06,462 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే భారీగా 5,255 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి.

Updated Date - 2020-09-20T08:07:06+05:30 IST