రష్యాలో ఒకేరోజు 5 వేలకు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-14T22:43:32+05:30 IST

రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 5,065 కరోనా

రష్యాలో ఒకేరోజు 5 వేలకు పైగా కరోనా కేసులు

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 5,065 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే పాజిటివ్ రేటు 0.6 శాతం ఎక్కువగా ఉంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,12,823కు చేరింది. తాజాగా బయటపడిన కేసులు మొత్తం 83 రీజియన్ల నుంచి నమోదైనట్టుగా రష్యాలోని రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. వీటిలో రాజధాని మాస్కో నుంచే అత్యధికంగా 688 కేసులు వెలుగుచేశాయి. ఇక మొత్తం 5,065 కేసుల్లో 1,313 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో 114 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15,498కు చేరుకుంది. ఇక ఒకేరోజు 6,568 మంది పూర్తిగా కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 7,22,964గా ఉంది. రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 3.2 కోట్ల కరోనా పరీక్షలను నిర్వహించింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలున్నాయి.

Updated Date - 2020-08-14T22:43:32+05:30 IST