ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్‌కు భారీ గిరాకీ !

ABN , First Publish Date - 2020-09-22T16:09:48+05:30 IST

కొవిడ్‌ చికిత్స కోసం రష్యా తయారుచేస్తున్న స్పుత్నిక్‌-5 వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్‌కు భారీ గిరాకీ !

మాస్కో, సెప్టెంబరు 21: కొవిడ్‌ చికిత్స కోసం రష్యా తయారుచేస్తున్న స్పుత్నిక్‌-5 వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఢాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌- ఈ టీకా ఉత్పత్తిదారులతో ఓ అవగాహనకు వచ్చి- వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షలు భారత్‌లో జరిపేందుకు, అనంతరం 100 మిలియన్‌ డోసులను కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదుర్చుకుంది. ఇది కాక- బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, మెక్సికో, సౌదీ అరేబియా సహా మరో ఐదు దేశాలు ఈ వ్యాక్సిన్‌ కోసం రష్యాను సంప్రదించాయి. దాదాపు 120 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ కోసం ఈ దేశాలన్నీ అడుగుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో పేర్కొంది.

Updated Date - 2020-09-22T16:09:48+05:30 IST