వీసా-ఫ్రీ ఎంట్రీపై ఆంక్షలు ఎత్తివేసిన రష్యా

ABN , First Publish Date - 2020-08-05T21:11:16+05:30 IST

స్వల్పకాలిక వ్యాపార పర్యటనలకు దేశానికి వచ్చే విదేశీయులకు రష్యా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

వీసా-ఫ్రీ ఎంట్రీపై ఆంక్షలు ఎత్తివేసిన రష్యా

మాస్కో: స్వల్పకాలిక వ్యాపార పర్యటనలకు దేశానికి వచ్చే విదేశీయులకు రష్యా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వీసా-ఫ్రీ ఎంట్రీపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి రష్యా ప్రధాని మిఖాలి మిషుస్తిన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాలతో విదేశీయులు వీసా-ఫ్రీ ఎంట్రీపై రష్యా రావడానికి అనుమతి లభించింది. అయితే తాజా ఆదేశాలు డిప్లమాటిక్ హోల్డర్స్‌ లేదా సర్వీస్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వారికి మాత్రమే అమలవుతాయి. రష్యా ఏ దేశాలతో అయితే వీసా-ఫ్రీ ఒప్పందం చేసుకుందో ఆయా దేశాలకు చెందిన వారు మాత్రమే రష్యాలోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఉంటుంది. వీసా-ఫ్రీ అంటే.. ఎటువంటి ట్రావెల్ వీసా లేకుండానే కేవలం పాస్‌పోర్ట్‌తో వేరే దేశంలోకి అడుగుపెట్టడం అన్నమాట. కాగా.. రష్యాలో ఇప్పటివరకు 866,627 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా మొత్తం 14,490 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది.   

Updated Date - 2020-08-05T21:11:16+05:30 IST