భారత్-చైనా మధ్య నిర్మాణాత్మక సంబంధాలు కీలకం : రష్యా

ABN , First Publish Date - 2020-06-04T03:37:51+05:30 IST

భారత దేశం, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ఇరు దేశాలు త్వరలోనే

భారత్-చైనా మధ్య నిర్మాణాత్మక సంబంధాలు కీలకం : రష్యా

న్యూఢిల్లీ : భారత దేశం, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ఇరు దేశాలు త్వరలోనే పరిష్కరించుకుంటాయన్న ఆశాభావాన్ని రష్యా బుధవారం వ్యక్తం చేసింది.  తూర్పు లడఖ్‌లో చైనా సైనికుల దూకుడును భారత సైనికులు నిలువరిస్తుండటంతో ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో రష్యా ఈ ప్రకటన చేసింది. భారత్, చైనా మధ్య నిర్మాణాత్మక సంబంధాలు ప్రాంతీయ సుస్థిరతకు చాలా కీలకమని రష్యా పేర్కొంది. 


తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదంలో సానుకూల పరిణామాలు వస్తాయని రష్యా ఆశిస్తోందని రష్యన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్ అన్నారు. రెండు మహోన్నత నాగరికతల మధ్య శాంతియుత పొరుగు కోసం సానుకూల పరిణామాలను ఆశిస్తున్నట్లు తెలిపారు. 


సుస్థిరత, సుస్థిర అభివృద్ధిపై ప్రాంతీయ చర్చను ప్రోత్సహించేందుకు భారతీయ, చైనీయ మిత్రుల మధ్య నిర్మాణాత్మక బాంధవ్యం చాలా ముఖ్యమని తెలిపారు. 


Updated Date - 2020-06-04T03:37:51+05:30 IST