అమెరికాకు రాకెట్ ఇంజిన్లు ఇవ్వం: రష్యా

ABN , First Publish Date - 2022-03-04T00:28:19+05:30 IST

ఉక్రెయిన్‌పై దాడి విషయంలో తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్న అమెరికాపై రష్యా ప్రతి చర్యలకు దిగింది. అమెరికాకు తాము సరఫరా చేస్తున్న రాకెట్ ఇంజిన్లను ఇకపై సరఫరా చేయబోమని స్పష్టం చేసింది.

అమెరికాకు రాకెట్ ఇంజిన్లు ఇవ్వం: రష్యా

ఉక్రెయిన్‌పై దాడి విషయంలో తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్న అమెరికాపై రష్యా ప్రతి చర్యలకు దిగింది. అమెరికాకు తాము సరఫరా చేస్తున్న రాకెట్ ఇంజిన్లను ఇకపై సరఫరా చేయబోమని స్పష్టం చేసింది. రష్యా స్పేస్ ఏజెన్సీ రొస్కొమోస్ అధిపతి డిమిట్రీ రొగోజిన్ గురువారం మీడియాతో మాట్లాడారు. అమెరికా తమ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆ దేశానికి రాకెట్ ఇంజిన్లు సరఫరా చేయలేమన్నారు. అమెరికా తమకు కావాల్సిన వాటిని ఉపయోగించుకుని, రాకెట్లు ప్రయోగించుకోవచ్చని డిమిట్రీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే సరఫరా చేసిన ఇంజిన్లకు సర్వీసింగ్ కూడా నిలిపివేస్తామన్నారు. డిమిట్రీ ప్రకారం... 1990 నుంచి రష్యా అమెరికాకు 180 అధునాతన రాకెట్ ఇంజిన్లను సరఫరా చేసింది. వాటిలో 98 ఇంజిన్లను అట్లాస్ లాంఛ్ వెహికల్స్‌కు వాడారు. యూరప్‌కు కూడా స్పేస్ లాంఛెస్‌కు సంబంధించి సహకారం నిలిపివేస్తామని గతంలోనే రష్యా హెచ్చరించింది. అలాగే బ్రిటీష్ కంపెనీకి తాము సరఫరా చేసిన శాటిలైట్లను మిలిటరీ సేవల కోసం వాడుకోకూడదని కూడా రష్యా సూచించింది.

Updated Date - 2022-03-04T00:28:19+05:30 IST