Ukraine పాఠశాల షెల్టర్‌పై Russia బాంబు.. 60 మంది మృతి?

ABN , First Publish Date - 2022-05-08T22:29:19+05:30 IST

Ukraine లోని Luhansk ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల షెల్టర్‌పై Russia కు చెందిన యుద్ధ విమానం బాంబు వేయడంతో పెద్ద సంఖ్యలో మరణించారని వార్తలు వస్తున్నాయి. సరిహద్దుకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉన్న ఈ పాఠశాల..

Ukraine పాఠశాల షెల్టర్‌పై Russia బాంబు.. 60 మంది మృతి?

కీవ్: Ukraine లోని Luhansk ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల షెల్టర్‌పై Russia కు చెందిన యుద్ధ విమానం బాంబు వేయడంతో పెద్ద సంఖ్యలో మరణించారని వార్తలు వస్తున్నాయి. సరిహద్దుకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉన్న ఈ పాఠశాల షెల్టర్‌లో 90 మంది ఉన్నట్లు మీడియా చెప్పింది. అయితే ఈ ప్రమాదం అనంతరం శిథిలాల నుంచి 30 మందిని రక్షించినట్లు, వీరిలో ఏడుగురు గాయపడ్డారని.. మరో 60 మంది శిథిలాల కింద ఉండొచ్చని లుహాన్క్స్ ప్రాంత మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి సెర్హీ హేడె తెలిపారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం స్పష్టంగా తెలిదని, వారిని వీలైనంత తొందరగా బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ఆయన సెర్హీ హేడె పేర్కొన్నారు. రష్యాకు చెందిన విమానం.. శనివారం సాయంత్రం ఈ పాఠశాల షెల్టర్‌పై బాంబు వేసింది. అనంతరం నాలుగు గంటల పాటు పెద్ద ఎత్తున అగ్ని మంటలు ఎగిసిపడ్డాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Read more