ఆ విషయంలో రష్యానే నెంబర్ 1

ABN , First Publish Date - 2022-03-08T23:59:20+05:30 IST

అగ్రదేశాల్లో ఒకటిగా ఉన్న రష్యా ఇప్పుడు అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై దాడితో అమెరికా, యూరోపియన్ యూనియన్‌తోపాటు ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.

ఆ విషయంలో రష్యానే నెంబర్ 1

అగ్రదేశాల్లో ఒకటిగా ఉన్న రష్యా ఇప్పుడు అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై దాడితో అమెరికా, యూరోపియన్ యూనియన్‌తోపాటు ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా నిలిచింది. ఇంతకుముందు అత్యధిక ఆంక్షలు కలిగిన దేశంగా ఇరాన్ ఉండేది. ఆ దేశంపై 3,616 రకాల ఆంక్షలు ఉండేవి. తాజాగా రష్యాపై అంతకుమించిన ఆంక్షలుండటం విశేషం. ఉక్రెయిన్‌పై దాడికి ముందే పలు దేశాలు 2,754 ఆంక్షలు విధించగా, దాడి తర్వాత మరో 2,778 ఆంక్షలు విధించారు. దీంతో ప్రస్తుతం రష్యాపై 5,532 ఆంక్షలున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించిన దేశాల్లో స్విట్జర్లాండ్ (568) ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో యూరోపియన్ యూనియన్ (518), కెనడా (454), ఆస్ట్రేలియా (413), అమెరికా (243), బ్రిటన్ (35), జపాన్ (35) ఉన్నాయి. రష్యా కాకుండా ఆంక్షలు ఎదుర్కొంటున్న టాప్-4 దేశాలు.. ఇరాన్ (3,616), సిరియా (2,608), ఉత్తర కొరియా (2,077), వెనిజులా (651).

Updated Date - 2022-03-08T23:59:20+05:30 IST