Ukraine Crisis: రష్యా ప్రతీకార చర్య.. 36 దేశాల విమానాలు రద్దు

ABN , First Publish Date - 2022-03-01T13:20:29+05:30 IST

యూరోపియన్‌ యూనియన్‌ దేశాల చర్యకు ప్రతిచర్య అనేలా రష్యా నిర్ణయం తీసుకుంది.

Ukraine Crisis: రష్యా ప్రతీకార చర్య.. 36 దేశాల విమానాలు రద్దు

మాస్కో, ఫిబ్రవరి 28: యూరోపియన్‌ యూనియన్‌ దేశాల చర్యకు ప్రతిచర్య అనేలా రష్యా నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై దూకుడుకు కళ్లెం వేసేందుకు గత వారం ఈయూ దేశాలు.. రష్యా విమాన సర్వీసులను రద్దు చేస్తే దీనికి దీటుగా రష్యా కూడా ఆ దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని నిర్ణయించింది. బ్రిటన్‌, జర్మనీ సహా 36 దేశాల విమానాలపై సోమవారం నిషేధం విధించింది. పశ్చిమ దేశాల తీరుకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టిన్నట్లు రష్యా విమాన యాన సంస్థ ప్రకటించింది. ఈ కారణంగా ప్రజలకు ప్రయాణ దూరం, చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే యూర్‌పలోని అత్యధిక దేశాలతో పాటు, కెనడా గగనతలంలో ప్రవేశానికి రష్యా విమానాలకు అనుమతి లేదు. ప్రస్తుతం రష్యా గగనతలంలోకి ప్రత్యేక అనుమతి ఉన్న విమానాలనే అనుమతిస్తున్నారు.

Updated Date - 2022-03-01T13:20:29+05:30 IST