రుషికొండలో తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-05T16:48:03+05:30 IST

రుషికొండలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పర్యావరణ మానవహారానికి టీడీపీ పిలుపునిచ్చింది. రుషికొండలో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు యత్నించారు.

రుషికొండలో తీవ్ర ఉద్రిక్తత

విశాఖ: రుషికొండలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పర్యావరణ మానవహారానికి టీడీపీ పిలుపునిచ్చింది. రుషికొండలో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సహా కార్యకర్తలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. రుషికొండ పర్యాటక ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ఒక్క కొండతోనే ఆగిపోలేదు. లెక్కలేనన్ని అరాచకాలు అక్కడ జరుగుతున్నాయి. ఆ పరిసరాలన్నీ తమ సొంతం అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ‘సెవెన్‌ స్టార్‌’ అభివృద్ధి  పేరుతో రుషికొండ మొత్తానికి ప్రభుత్వం గుండు కొట్టిస్తోంది. పచ్చటి కొండను చుట్టూ తవ్వేసి, చెట్లు నరికేసి బోడికొండగా మార్చింది. రెండేళ్ల కిందటి రుషికొండకు, ఇప్పటికీ పోలికే లేదు. ఎవరికోసమో తెలియదు, అసలు పరమార్థం ఏమిటో తెలియదు. కానీ... అక్కడ భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ సర్కారు న్యాయస్థానాలను అభ్యర్థిస్తోంది. 

Updated Date - 2022-06-05T16:48:03+05:30 IST