Abn logo
May 10 2021 @ 22:43PM

ఇలాగైతే కరోనా నియంత్రణ ఎలా?

అనంతసాగరం, మే 10: కరోనా రక్కసితో ప్రాణాలు పోతున్నా కొందరిలో చలనం లేదు. మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరుతున్నా స్పందన లేదు. అనంతసాగరం బ్యాంకు వద్ద ఖాతాదారులు సోమవారం గుంపులుగా గుమికూడారు. ఇక్కడ భౌతి క దూరం పాటించని పరిస్థితి కనిపించింది. కరోనా విస్తరిస్తున్న తరుణం లో ప్రజలు ఇలా గుమికూడడం ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు అదికారు లు ఖాతాదారులకు సర్దిచెబుతున్నా వినిపించుకోని పరిస్థితి. ఇలాగైతే కరోనా నియంత్రణ ఎలా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. 

Advertisement