Abn logo
Apr 18 2021 @ 00:31AM

రూర్బన్‌ పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలి

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 17 : రూర్బన్‌ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో రూర్బన్‌ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పా లనాధికారి మాట్లాడుతూ పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కుంటాల మండలంలో జరుగుతున్న రూర్బన్‌ పథకం ద్వారా అమలవుతున్న అంగన్‌వాడీ భవన నిర్మాణం, వ్యవసాయ మార్కెట్‌ గిడ్డంగుల నిర్మాణం, దాల్‌మిల్‌, రోడ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులపై సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని, 2527 కల్లాలలో 1497 పంట కల్లాలు పూర్తి కాగా మిగిలిన పంటకల్లాలు ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు నిర్మా ణాల పురోగతిని ప్రతీరోజు పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించా రు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ, తది తరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement