కొత్తూర్: క్రీడాకారులతో వీర్లపల్లి శంకర్, అజయ్‌నాయక్, మిట్టునాయక్
కొత్తూర్/యాచారం, జనవరి28: గ్రామీణ యువకులు పట్టుదలతో క్రీడల్లో రాణించాలని షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. మండలంలోని ఇన్ముల్‌నర్వ సర్పంచ్ అజయ్‌మిట్టునాయక్ తల్లి పాత్లావత్ కమ్లీబాయి ఇటీవల మృతిచెందగా ఆమె జ్ఞాపకార్థం గ్రామంలో అజయ్‌మిట్టునాయక్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీని వీర్లపల్లిశంకర్ ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఐదు రోజుల పాటు క్రికెట్ టోర్నీ కొనసాగుతుందని నిర్వాహకుడు అజయ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిట్టునాయక్, ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, నాయకులు శంకర్‌నాయక్, బిచ్చనాయక్, షిరాజ్ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పోర్ట్‌మీట్‌ను ప్రారంభించారు. జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్ .ఇందిర పాల్గొన్నారు.