నాలుగు నెలల కనిష్టానికి పడిపోయిన గ్రామీణ నిరుద్యోగిత

ABN , First Publish Date - 2020-07-13T21:27:11+05:30 IST

జులై 12తో ముగిసిన వారాంతానికి దేశంలోని గ్రామీణ నిరుద్యోగ రేటు నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది.

నాలుగు నెలల కనిష్టానికి పడిపోయిన గ్రామీణ నిరుద్యోగిత

న్యూఢిల్లీ: జులై 12తో ముగిసిన వారాంతానికి దేశంలోని గ్రామీణ నిరుద్యోగ రేటు నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. గత వారం నిరుద్యోగ రేటు 7.78 శాతంగా ఉండగా, జులై 12తో ముగిసిన వారానికి 6.34 శాతానికి ఇది పడిపోయినట్టు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 22తో ముగిసిన వారం కంటే కూడా ఇది తక్కువ కావడం గమనార్హం. మార్చి 15తో ముగిసిన వారంలో గ్రామీణ నిరుద్యోగిత 6.07 శాతంగా ఉండగా, ఆ తర్వాత ఇదే కనిష్టం. ఇక, మొత్తంగా నిరుద్యోగ రేటు క్రితం వారంతో పోలిస్తే జులై 12తో ముగిసిన వారానికి 8.87 శాతం నుంచి 7.44 శాతానికి పడిపోయింది. 

Updated Date - 2020-07-13T21:27:11+05:30 IST