రహదారుల అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2022-07-08T03:51:57+05:30 IST

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

రహదారుల అభివృద్ధికి చర్యలు
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి, మేయర్‌ స్రవంతి

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(జడీ ్ప), జూలై 7 : నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జి నుంచి అన్నమయ్య సర్కిల్‌, ఇస్కాన్‌ సిటీ, కొండాయపాలెం, జాతీయ రహదారి వరకు రూ.65 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గురువారం మేయర్‌ స్రవంతితో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయని వాటి మరమ్మతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారన్నారు. అయ్యప్పగుడి సెంటర్‌ నుంచి బోసుబొమ్మ వరకు రూ.2.5 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపడుతున్నామని, 20 రోజుల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 

ప్లీనరీకి భారీ జన సమీకరణ

గుంటూరులో శుక్ర, శనివారాల్లో జరిగే వైసీపీ రాష్ట్ర ప్లీనరీకి భారీగా జన సమీకరణ చేయాలని కార్పొరేటర్లకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన గురువారం 26 డివిజన్ల కార్పొరేట్లతో ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమై జన సమీకరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విజయా డెయిరీ చైర్మన్‌ కొండరెడ్డి రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-08T03:51:57+05:30 IST