Abn logo
Feb 26 2021 @ 23:24PM

పల్లెప్రగతి పనులను నిరంతరం చేపట్టాలి

నేరడిగొండ, ఫిభ్రవరి 26: గ్రామాల్లో పల్లెప్రగతి పనులను నిరంతరం చేపట్టాల ని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచా యతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో  అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్‌డీఏ పీడీ రాథోడ్‌ రాజేశ్వర్‌ హాజరై మాట్లాడారు. ప్రతిరోజూ ట్రాక్టర్‌ల ద్వారా చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించాలన్నారు. రోడ్లకు దూరం గా మెక్కలు నాటాలన్నారు. పల్లె ప్రకృతివనాల్లో నాటిన ప్రతీ మొక్కకు ట్యాంకర్‌ల ద్వారా నీరుపోయాలన్నారు. డంపింగ్‌ యార్డుకు తరలించిన చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువులను తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement