పల్లె పల్లెకూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2021-01-27T06:03:43+05:30 IST

తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పల్లెప ల్లెకూ, గడప గడపకూ అందించడమే లక్ష్యంగా జిల్లా అధి కార యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు.

పల్లె పల్లెకూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ఎమ్మెల్యే, నాయకులు

ఫజాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్‌ రవి..ఫజిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

జగిత్యాల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పల్లెప ల్లెకూ, గడప గడపకూ అందించడమే లక్ష్యంగా జిల్లా అధి కార యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర వేడుకలు మం గళవారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఖిల్లా లో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా కలెక్టర్‌ రవి జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్‌   మాట్లాడారు. జిల్లాలో 1063 కుటుంబాలకు రైతు బీమా, 1,99,799 రైతులకు రైతు బంధు అమలు చేస్తున్నామన్నా రు. కరోనా ప్రభావంతో విద్యావ్యవస్థ కుంటుపడిందని, ఫి బ్రవరి 1 నుంచి పాఠశాలలు పున ః ప్రారంభం అవుతున్న తరుణంలో బడులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చే శామన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో ధరణి పోర్టల్‌ అ మలు చేస్తూ, 15 నిమిషాల్లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు గైకొంటున్నామన్నారు. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం చేయడంతో జగిత్యాలకే ఒక తలమానికంగా నిలవనుందన్నారు. జిల్లాలో రెండు పడక గదుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామన్నా రు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా న్యా యాధికారికి, స్వాతంత్య్ర సమరయోధులకు, శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమైన ఎస్పీకి, సిబ్బందికి, నిరంతరం ప్రజల్లో అవగాహన పెం పొందిస్తూ చైతన్యపరచడంలో ముందుండే ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా కు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపా రు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం వివిధ శాఖల్లో అ త్యుత్తమ సేవలు అందించిన 203మంది ఉద్యోగులకు స ర్టిఫికెట్లు ప్రధానం చేసి, అభినందించారు. తదనంతరం జి ల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సం క్షేమ, అభివృద్ధి పథకాల స్టాల్‌లను పరిశీలించారు. అంత కు ముందు స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా శా లువాలతో అతిథుల చేతుల మీదుగా సత్కరించి, ప్రముఖ సూక్ష్మకళాకారుడు గాలిపెల్లి చోలేశ్వర్‌ రూపొందించిన సైక త శిల్పాన్ని పరిశీలించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్‌ క మిషన్‌ ఛైర్మెన్‌ రాజేశంగౌడ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత, ఎ మ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎస్పీ సిం ధూశర్మ, బల్దియా ఛైర్‌పర్సన్‌ శ్రావణి, అదనపు కలెక్టర్‌లు రాజేశం, అరుణశ్రీ, ఆర్డీవోలు మాధురి, వినోద్‌ కుమార్‌ల తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని అధికా రులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:03:43+05:30 IST