కేసీఆర్‌తోనే గాంధీ కలలుగన్న గ్రామాభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-19T05:04:20+05:30 IST

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామాభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలోనే నేరవేరనుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

కేసీఆర్‌తోనే గాంధీ కలలుగన్న గ్రామాభివృద్ధి
విలేకర్లతో మాట్లాడుతున్న ఎంపీ నామా

 కొవ్వూరు-భద్రాచలం రైల్వైలైన్‌ పూర్తిచేస్తాం

ఎంపీ నామా నాగేశ్వరరావు

సత్తుపల్లి, అక్టోబరు 18: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామాభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలోనే నేరవేరనుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ముందుగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.  దసరా పర్వదినం సందర్భంగా గ్రామాల బాట పట్టిన జనాన్ని చూస్తుంటే జన్మనిచ్చిన ఊరుకు మేలు చేసేలా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కరోనా కారణంగా ఇబ్బందులు తప్పలేదని, ప్రభుత్వ పథకాల ప్రజలకు అందుతున్నాయంటే అది కేసీఆర్‌ ప్రజానాయకుడు కావడం వల్లనేనని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఆశీర్వదించాలని, గత 70 ఏళ్లలో సాధించలేదని ఈ ఏడేళ్లలోనే ముఖ్యమంత్రి చేసి చూపించారన్నారు.  గ్రామ, మండల స్థాయిలో కమిటీలు పూర్తవ్వగా జిల్లా స్థాయిలో ప్రకటించాల్సి ఉందన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ 3లక్షల కోట్ల మెట్రిక్‌ టన్ను ధాన్యాన్ని విక్రయించడంతో రూ.50వేల కోట్ల పంట ఖరీదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూస్తున్న సరిహద్దు రాష్ర్టాల గ్రామాలు తెలంగాణాలో కలపాలని, లేకుంటే అక్కడి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నట్లు చెప్పారు. సీతారామతో జిల్లా సస్యశ్యామలమవుతుం దన్నారు. ప్రజలకు సదుపాయాలను కల్పించడంలో, ప్రాజెక్టులు సాధించడంలో తాను ముందుంటానని చెప్పారు. 

కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్‌ సాధన 40ఏళ్ల నుంచి సాగుతుందని, కేంద్రానికి 120ఉత్తరాలు తాను రాశానని, కేంద్రమంతులు, రైల్వేబోర్డు అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినట్లు చెప్పారు. 2012లో రైల్వే బడ్జెట్‌లో లైన్‌ మంజూరవ్వగా ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో సత్తుపల్లి వరకే పనులు సాగుతున్నట్లు చెప్పారు. ఆంధ్రాకు ఈ లైన్‌ కలవడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని, అయితే సగం వాటా నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ చెల్లించాల్సి ఉందని, అప్పటి వరకు జాప్యం తప్పదన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎంపీ నామాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కౌన్సిలర్లు కొత్తూరు ఉమ, చాంద్‌పాషా, రఘు, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు మోనార్క్‌ రఫీ, యాగంటి శ్రీనివాసరావు, నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డాక్టర్‌ నరసింహారావు, దొడ్డా శంకరరావు, వల్లబనేని పవన్‌, వనమా వాసు, అమరవరపు కృష్ణారావు, కంచర్ల నాగేశ్వరరావు, మల్లూరు అంకంరాజు, మదీనానాషా, పర్వతనేని వేణు, కామా శ్యాంసన్‌, మోటపోతుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో నామా

తల్లాడ: తల్లాడ మండలం రంగంబంజరలో సోమవా రం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల ముగింపులో ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T05:04:20+05:30 IST