సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
ఆసిఫాబాద్, మే 27: ప్రభుత్వం జూన్3నుంచి నిర్వహించే 5వవిడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం టాటీయా గార్డెన్లో పల్లె ప్రగతిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపుకలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే అత్రం సక్కుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతి నిదులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపుకలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేసినప్పుడే పల్లెలు సస్యశ్యామలమవుతా యన్నారు. కార్యక్రమంలో డీపీవో రమేష్, మార్కెట్‌కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేష్, జడ్పీ టీసీలు అరిగెల నాగేశ్వర్రావు, ద్రుపదబాయి పాల్గొన్నారు.