పల్లె, పట్టణ ప్రగతికి సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2022-05-17T05:24:11+05:30 IST

ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పి.ఉ దయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

పల్లె, పట్టణ ప్రగతికి సన్నద్ధం కావాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

-  కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ 

- కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం


నాగర్‌కర్నూల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పి.ఉ దయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శా ఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ త పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రతిభ కనబరి చిన గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీల వార్డు సభ్యు లు, సర్పంచులు, కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి పల్లె ప్రగతిలో ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు ఎకరం స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నారని, అందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. గత కార్యక్రమా లకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు ఉంటే వెంటనే చెల్లించాలని తెలిపారు. ఈసారి పల్లె, పట్టణ ప్రగతికి సంబంధించి కార్యక్రమాలకు ముందు, తరువాత ఫొ టోలు తీసి రికార్డు తయారు చేసేలా చర్యలు తీసుకుం టున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు మనూచౌద రి, రాజేష్‌కుమార్‌, ఆర్‌డీవోలు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.


’పది’ పరీక్షలకు పకడ్బందీ చర్యలు 

ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో తరగ తి వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పక డ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ పి.ఉద య్‌కుమార్‌ తెలిపారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై సోమవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సం దీప్‌సుల్తానియా నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పాల్గొని జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈసారి 11,082 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రా యనున్నారని పేర్కొన్నారు. అందుకు 62 పరీక్ష కేంద్రా ల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేసి సిద్దంగా ఉంచామని తెలిపారు. జిల్లా విద్యాధికారి గోవిందురాజులు, వైద్యాధి కారి డాక్టర్‌ సుధాకర్‌లాల్‌, డీటీవో లక్ష్మీనారాయణ, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 


వేసవి క్రీడా శిబిరాలు వినియోగించుకోవాలి 

ప్రతి విద్యార్ధి వేసవి క్రీడా, సాంస్కృతిక శిబిరాలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అ న్నారు. సోమవారం జిల్లా యువజన, క్రీడలశాఖ  ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రామాలయం ప్రాథ మిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 5 వరకు శిక్షణ శిబిరా లను నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంతు, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాష్‌, సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డెంగీ నివారణపై విస్తృత ప్రచారం కల్పించాలి

డెంగీ, మలేరియా నివారణపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు.  జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని సోమవారం కలెక్టర్‌ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతో డెంగీని నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా వైద్య ఆరోగ్యశాఖ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌లాల్‌, ఉప వైద్యాధికారి వెంకటదాసు, మలేరియా సహాయ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:24:11+05:30 IST