Abn logo
Aug 3 2020 @ 13:21PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘22’ హీరో రూపేష్ కుమార్ చౌద‌రి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్  కార్యక్రమంకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటుతున్నారు. ఇదొక యజ్ఞంలా ముందుకు సాగుతోంది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘22’ సినిమా హీరో రూపేష్ కుమార్ చౌద‌రి పాల్గొని మొక్క‌లు నాటారు. ఆదివారం(ఆగ‌స్ట్‌2) రూపేష్ కుమార్ పుట్టిన‌రోజు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకున్న రూపేష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌ను నాటారు. ఈ సంద‌ర్భంగా రూపేష్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ ‘‘పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇలాంటి ఓ గొప్ప కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది. అంద‌రూ స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కులు నాటాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement