దశాబ్ద కాలంలో రూ. లక్ష కోట్లు..! జేఎస్‌డబ్ల్యేూ ఎనర్జీ భారీ స్కెచ్... కొనుగోళ్ళకు అనలిస్టుల టార్గెట్ చూస్తే...
హైదరాబాద్ : జేఎస్‌డబ్ల్యేూ ఎనర్జీ ప్రణాళికలు మదుపరులను ఉత్తేజపరుస్తున్నాయి. ఇలాంటి స్టాక్ ఖచ్చితంగా కొనుగోలు చేయాలని అన్పిస్తోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. . ఎందుకంటే కంపెనీ రీఆర్గనైజేషన్ తర్వాత థర్మల్ పవర్ వ్యాపారం 3200 మెగావాట్లుగా, కంపెనీ కిందనే ఉత్పత్తి అవుతుండగా, 1400 మెగావాట్ల సామర్ధ్యంతో పాటు మరో 2500 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెన్యువబుల్ ఎనర్జీ సబ్సిడరీ అయిన జేఎస్‌డబ్ల్యేూ నియో ఎనర్జీ కంపెనీ సెటప్ చేశారు. సజ్జన్ జిందాల్ కంపెనీ అయిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ , విద్యుదుత్పత్తిలో ఇప్పుడు రెండు రకాల మార్గాలను అవలంబిస్తోంది. ఒకటి రెగ్యులర్ బిజినెస్ కాగా, రెండోది రెన్యువబుల్ ఎనర్జీ సోర్సెస్. తద్వారా కంపెనీ విలువను అన్‌లాక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో... కంపెనీ కేపెక్స్ రూపంలో ప్రతి ఏటా రూ. 10వేలకోట్ల చొప్పున పదేళ్లపాటు వ్యయం చేస్తామని జాయింట్ ఎండి & సీఈఓ ప్రశాంత్ జైన్ పేర్కొన్నారు. మరో ఎనిమిదేళ్ళ నాటికి... జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మొత్తం ఉత్పాదన సామర్ధ్యం 20 గిగావాట్లకు చేరేట్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం కంపెనీ సామర్ధ్యం 4559 మెగావాట్లు మాత్రమే, మూడో త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ. 1984కోట్ల ఆదాయంపై రూ. 324కోట్ల లాభం ఆర్జించింది.
ఇవి కూడా చదవండి