రూ. 342 తో రూ. 4 లక్షల లబ్ది...

ABN , First Publish Date - 2021-10-26T01:26:29+05:30 IST

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ఉంటే... ఏడాదికి కేవలం రూ. 342 తో ఏకంగా రూ. 4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఎలాగంటే... కేంద్ర ప్రభుత్వం రెండు రకాల బీమా పథకాలనందిస్తోన్న విషయం తెలిసిందే.

రూ. 342 తో రూ. 4 లక్షల లబ్ది...

ముంబై : దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ఉంటే... ఏడాదికి కేవలం రూ. 342 తో ఏకంగా రూ. 4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఎలాగంటే... కేంద్ర ప్రభుత్వం రెండు రకాల బీమా పథకాలనందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేబీవై) పాలసీలు ఎస్‌బీఐ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక వివరాలిలా ఉన్నాయి. 


ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే... ఈ డబ్బు  నామినీకి అందుతాయి. దీనికి ఏడాదికి రూ. 12 చెల్లించాలి. కాగా 18- 70 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇక... జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో కూడా రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే నామినీకి లేదా కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు వస్తాయి. దీనికి ఏడాదికి రూ. 330 ను ప్రీమియంగా చెల్లించాలి. కాగా... 18-50 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ పొందొచ్చు. ఆటో డెబిట్ ఫీచర్ ఎంచుకుంటే ప్రతి సంవత్సరం రూ. 342 మేర బ్యాంక్ ఖాతా నుంచే జమవుతాయి. 

Updated Date - 2021-10-26T01:26:29+05:30 IST