ఏడాది చివరికి రూపాయి @81!

ABN , First Publish Date - 2022-06-23T07:59:41+05:30 IST

ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి పతనం కొనసాగుతోంది. బుధవారం డాలర్‌ మారకంలో రూపాయి మరో జీవిత కాల కనిష్ఠ స్థాయికి దిగజారింది.

ఏడాది చివరికి రూపాయి @81!

బోఫా అంచనామరో

కనిష్ఠానికి దేశీయ కరెన్సీ 


ముంబై: ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి పతనం కొనసాగుతోంది. బుధవారం డాలర్‌ మారకంలో రూపాయి  మరో జీవిత కాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. ఉదయం రూ.78.13 వద్ద ప్రారంభమైన రూపాయి మారకం రేటు, చివరికి 27 పైసల నష్టంతో రూ.78.40 వద్ద ముగిసింది. ఈ సంవత్సరం డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇప్పటికే ఐదు శాతం నష్టపోయింది. ఆర్థిక పరిస్థితులు కుదుట పడకపోతే ఈ సంవత్సరం డిసెంబరు నాటికి డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.81కి పడిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ ‘బోఫా’ బుదవారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. 


ఎఫ్‌పీఐల అమ్మకాలు : ఎడతెగని ఎఫ్‌పీఐల అమ్మకాలు రూపాయి మారకం రేటుని మరింత దెబ్బతీస్తున్నాయి. ఈ సంస్థలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత మార్కెట్‌లో 2,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.11 లక్షల కోట్లు) విలువైన షేర్లు, రుణ పత్రాలను విక్రయించాయి.


సెన్సెక్స్‌ 710 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం మరోసారి నష్టాల బాట పట్టింది. సెనెక్స్‌ 709.54 పాయింట్ల నష్టంతో 51,822.53 వద్ద, 225.50 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,413.30 వద్ద ముగిశాయి. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండడం, లాభాల స్వీకరణ అమ్మకాలు ఇందుకు దోహదం చేశాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి నిఫ్టీ 14,500 స్థాయికి దిగజారవచ్చునని బోఫా సెక్యూరిటీస్‌ తాజా అంచనా. గతంలో ప్రకటించిన అంచనా 16,000.  దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఆటుపోట్లు ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబరు వరకు కొనసాగుతాయని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, నిధుల సరఫరా తగ్గడం, అమెరికాలో ఆర్థిక మాంద్యం ముప్పు ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది. 

Updated Date - 2022-06-23T07:59:41+05:30 IST