Abn logo
May 16 2020 @ 14:54PM

ఒక్క రూమర్.. ఆమె కెరీర్‌ను మార్చేసింది!

మానసా రాధాకృష్ణన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ హీరోయిన్ గురించి కొన్ని రోజుల క్రితం వరకు చాలా మందికి తెలియదు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో మానస హీరోయిన్ అని వార్త రావడంతో ఈమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. పవన్ అభిమానులందరూ ఈ అమ్మాయి గురించి గూగుల్‌లో అన్వేషణ ప్రారంభించారు. 


తన సినిమాలో హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, మానస గురించి వస్తున్న వార్తలు నిజం కాదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశాడు. అయితే అప్పటికే మానసకు క్రేజ్ వచ్చేసింది. టాలీవుడ్ దర్శకనిర్మాతలు చాలా మంది మానస గురించి ఎంక్వైరీ ప్రారంభించారట. టాలీవుడ్ యంగ్ హీరోలకు ఈమె మంచి ఛాయిస్ అని అనుకుంటున్నారట. ఏదేమైనా ఒక్క రూమార్ మానసకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement