Abn logo
Nov 29 2020 @ 21:34PM

బన్నీ-కొరటాల కాంబో.. బన్నీ రోల్‌పై రూమర్లు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సంచలన దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప'. కరోనా అన్‌లాక్‌ ప్రకటించిన తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించుకుంది. అయితే కరోనా లాక్‌డౌన్‌లో అల్లు అర్జున్‌ 'పుష్ప' తర్వాత చేయబోయే చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు. సక్సెస్‌ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇంకా ఈ సినిమా గురించి మేకర్స్‌ ఎటువంటి సమాచారం బయటపెట్టలేదు.. కానీ ఈ సినిమాలో బన్నీ రోల్‌ ఇలా ఉంటుందని కొందరు రూమర్లు స్టార్ట్ చేశారు.


వారు చెబుతున్న ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఫస్టాఫ్‌ అంతా స్టూడెంట్‌ లీడర్‌గానూ, సెకండాఫ్‌ అంతా రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని అంటున్నారు. బన్నీ ఇటువంటి పాత్ర ఇప్పటి వరకు టచ్‌ చేయలేదు కాబట్టి.. ఇలా పుట్టిస్తున్నారో.. లేదా యూనిట్‌ నుంచి ఏమైనా లీక్‌ అయ్యిందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే సోషల్‌ మీడియాలో మాత్రం బన్నీ రోల్‌పై రూమర్లు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement