Rumeli Dhar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్ రుమేలీ ధర్..

ABN , First Publish Date - 2022-06-22T22:05:47+05:30 IST

టీమిండియా మహిళా క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా (Team India all-rounder) రాణించిన రుమేలీ ధర్ (Rumeli Dhar) అంతర్జాతీయ క్రికెట్‌లోని..

Rumeli Dhar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్ రుమేలీ ధర్..

టీమిండియా మహిళా క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా (Team India all-rounder) రాణించిన రుమేలీ ధర్ (Rumeli Dhar) అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ (Rumeli Dhar Retirement) ప్రకటించింది. 38 ఏళ్ల ఈ టీమిండియా మహిళా క్రికెటర్ 2003లో ఇంగ్లండ్‌తో (England) జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు 78 వన్డేల్లో (ODI) 961 రన్స్‌, 18 టీ20ల్లో (T20) 131 పరుగులు చేసింది. 4 టెస్టుల్లో (Test Matches) రుమేలీ ధర్‌ (Rumeli Dha) 236 పరుగులు చేసింది. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 1328 పరుగులు, 84 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా రాణించింది. 18 టీ20లు, 78 వన్డేలు, 4 టెస్ట్ మ్యాచ్‌లు టీమిండియా తరపున రుమేలీ ధర్ ఆడింది.



వెస్ట్ బెంగాల్‌లోని శ్యామ్ నగర్ నుంచి మొదలైన తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు (Cricket Career) ముగింపు పలికే సమయం వచ్చిందని, అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని ఆమె తన ఇన్‌స్టాగ్రాం (Instagram) ద్వారా ప్రకటన చేసింది. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, 2005లో వరల్డ్ కప్ ఫైనల్‌లో (World Cup Final) ఆడటమే కాకుండా, జట్టును నడిపించే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. తన కుటుంబానికి, బీసీసీఐకి (BCCI), తన స్నేహితులకు, తనకు ఆడే అవకాశం ఇచ్చిన టీమ్స్‌కు (Bengal, Railways, Air India, Delhi, Rajasthan and Assam), తనను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది.

Updated Date - 2022-06-22T22:05:47+05:30 IST