కాలనీ నిర్మాణంలో నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-01-19T05:39:46+05:30 IST

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ నిర్మాణంలో నిబంధనలు పాటించాలని హౌసింగ్‌ పీడీ టి.వేణుగోపాల్‌ అన్నారు. స్థానిక టీటీడీసీలో సోమవారం నియోజకవర్గంలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

కాలనీ నిర్మాణంలో నిబంధనలు పాటించాలి

ఎచ్చెర్ల: వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ నిర్మాణంలో నిబంధనలు పాటించాలని హౌసింగ్‌ పీడీ టి.వేణుగోపాల్‌ అన్నారు. స్థానిక టీటీడీసీలో సోమవారం నియోజకవర్గంలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్ధిదా రులతో మాట్లాడి చైతన్యపర్చాలన్నారు. 340 చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ1.80 లక్షల యూనిట్‌ విలువ అని చెప్పారు. కార్యక్రమంలో  ఎంపీడీవో పావని, హౌసింగ్‌ ఈఈ పి.కూర్మినాయుడు, డీఈఈ జి.రామ్మూర్తి, ఏఈలు యు.రాజేంద్రప్రసాద్‌, కె.అప్పలనాయుడు, బి.గోపీకృష్ణ, ఎం.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల  నియోజకవర్గంలో 5268 ఇళ్లు తొలి విడతలో నిర్మించనున్నారు.

గుజరాతీపేట: జగనన్న కాలనీల నిర్మాణానికి సంబంధించి మెటీరియల్‌ ఇండెంట్‌-పంపిణీ, ఎంబుక్‌ నమోదు, పేమెంట్స్‌, తదితర సాంకేతిక అంశాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డ్‌ ఎమినిటీలు క్షుణ్ణంగా పరిశీలించాలని  నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య సూచించారు. సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ఈఈ కూర్మినాయుడులు పాల్గొన్నారు. 

పాలకొండ : గృహ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నట్టు డీఎల్‌పీవో ప్రభావతి, ఈఈ రమేష్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం పాలకొండలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.   

Updated Date - 2021-01-19T05:39:46+05:30 IST