Abn logo
Apr 22 2021 @ 00:52AM

కరోనా కట్టడికి నిబంధనలు పాటించాలి

-మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి

వేములవాడ, ఏప్రిల్‌ 21 : కరోనా వైరస్‌ రెండవ దశ ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రజలందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు అన్నారు. వేములవాడ పట్టణంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నాడు పురపాలక సంఘం కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు, మరణాల సంఖ్య పెరుగుతున్నందున పాకిక్ష లాక్‌డౌన్‌ పాటించడమే మార్గమని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని సూచించారు. అయితే లాక్‌డౌన్‌కు ప్రభుత్వం నుండి అనుమతి లేనందున ప్రజలంతా విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరుచుకోవడం వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలోనూ సమూహాలుగా ఏర్పడరాదని నిర్ణయించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement