ఒక రాజకీయ పార్టీ.. జాతీయ పార్టీగా మారేందుకు ఎలాంటి నిబంధలుంటాయంటే..

ABN , First Publish Date - 2022-03-14T14:00:12+05:30 IST

ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ..

ఒక రాజకీయ పార్టీ.. జాతీయ పార్టీగా మారేందుకు ఎలాంటి నిబంధలుంటాయంటే..

ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్‌ను సొంతం చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని 'ఆప్' పంజాబ్‌లో ఉత్సాహంతో ఎన్నికలలో పోటీ చేసి, కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. గోవాలో కూడా ఆప్ రెండు సీట్లు సాధించి తన ఆధిక్యతను చాటుకుంది. అనేక ఇతర రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ వాటా, ఓట్ల శాతం పెరుగుతోంది. పంజాబ్‌లో విజయం సాధించడంతో ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతోందనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాగా దేశంలో దాదాపు 400 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే వీటిలో 7 మాత్రమే జాతీయ పార్టీ హోదాను పొందాయి. దేశంలో మూడు రకాల రాజకీయ పార్టీలున్నాయి. జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, ప్రాంతీయ పార్టీ. దేశంలో 7 జాతీయ పార్టీలే కాకుండా 35 రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు, 350కి పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా మారాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఎలా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


రాజకీయ పార్టీలకు.. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీ హోదా కల్పిస్తుంది. రాజకీయ పార్టీల కోసం పీఆర్ ఏజెన్సీని నడుపుతున్న  మీడియా విశ్లేషకుడు వినీత్ కుమార్  దీని గురించి పలు వివరాలు అందించారు.  రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా మారేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు, ఓట్ల శాతం, అనేక రాష్ట్రాల్లో గుర్తింపు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనల ఆధారంగా జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. జాతీయ పార్టీ హోదా కల్పించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను విధించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి నిబంధన: మూడు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీ 2 శాతం సీట్లు గెలుచుకోవాలి.

రెండవ నిబంధన: నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.

మూడవ నిబంధన: ఒక రాజకీయ పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాలతో పాటు లోక్‌సభలో 6 శాతం ఓట్లను పొందాలి. లేదా అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్లను సంపాదించాలి.

దేశంలో జాతీయ పార్టీలు ఇవే..

బీజేపీ (భారతీయ జనతా పార్టీ)

కాంగ్రెస్ (భారత జాతీయ కాంగ్రెస్)

బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)

సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా)

సీసీఐ (ఎం) (మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ)

ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)

టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్)

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రాంతీయ పార్టీగా ఉంది. ఇప్పుడు జాతీయ పార్టీగా మారాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు, రెండు సీట్లు రావాలి. ఈసారి గోవాలో అది సాధ్యమైంది. రానున్న కాలంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరు బాగుంటే, జాతీయ పార్టీగా అవతరించేందుకు అవకాశాలుంటాయి. ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా మారితే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మొదటి ప్రయోజనం గుర్తింపు.. ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా వస్తుంది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత, అఖిల భారత స్థాయిలో రిజర్వు చేసిన ఎన్నికల గుర్తును పొందుతాయి. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులను ప్రతిపాదించే సంఖ్య పెరుగుతుంది. అలాగే జాతీయ మీడియాలో ప్రచారం దక్కుతుంది. దీంతో పార్టీ పరిధిని సులభంగా పెంచుకోవచ్చు. 




Updated Date - 2022-03-14T14:00:12+05:30 IST