రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-05T06:58:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీ వల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరా టానికి సంఘీభావం తెలు పుతూ శుక్రవారం అమలాపురం గడియార స్తంభం సెం టర్‌లో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
అమలాపురంలో నిరసన తెలుపుతున్న దృశ్యం

అమలాపురం టౌన్‌, డిసెంబరు 4: కేంద్ర ప్రభుత్వం ఇటీ వల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరా టానికి సంఘీభావం తెలు పుతూ శుక్రవారం అమలాపురం గడియార స్తంభం సెం టర్‌లో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ కార్మికసంఘం, కౌలురైతుల సంఘం, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, కౌలురైతు  సంఘ జిల్లా నాయకులు పీతల రామచంద్రరావు, చెల్లుబోయిన కేశవశెట్టి, గుబ్బల రమేష్‌లు మాట్లా డుతూ కేంద్రం తీసుకువచ్చిన నల్ల బిల్లులను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి తీసుకు వస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు. ్జ్జకార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి పచ్చి మాల వసంత కుమార్‌, వివిధ సంఘాల నాయ కులు జి.దైవకృప, వాసంశెట్టి సత్తిరాజు, అడపా సత్యనారాయణ, కామిరెడ్డి చంద్రరావు, పి.శేషారావు, ఎం.వెంకటేష్‌, కె.రాం ప్రసాద్‌, జి.ఆదినారాయణ, జి.ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-05T06:58:29+05:30 IST