శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రుద్రవీణ’. రఘు కుంచె విలన్‌గా నటించారు. రాగుల లక్ష్మణ్, శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రీలుక్‌ను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా విడుదల చేశారు. ఆనాటి ‘రుద్రవీణ’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం కూడా విజయం అందుకోవాలని వారు ఆకాంక్షించారు. ఇది ప్రతి ఒక్కరూ కచ్చితంగా మెచ్చుకునే చిత్రం అవుతుందని నిర్మాత అన్నారు. రివెంజ్ డ్రామాతో తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి మహావీర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: జి.ఎల్. బాబు.