Abn logo
May 12 2021 @ 00:58AM

రుచి సోయా చేతికి పతంజలి బిస్కెట్ల వ్యాపారం

న్యూఢిల్లీ: పతంజలి గ్రూపు తన బిస్కెట్ల వ్యాపారాన్ని రుచి సోయాకు విక్రయించింది. ఇందుకోసం పతంజలి నేచురల్‌ బిస్కెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఎన్‌బీపీఎల్‌) కంపెనీకి రెండు విడతల్లో రూ.60.02 కోట్లు చెల్లించనున్నట్టు రుచి సోయా తెలిపింది. రుచిసోయా బోర్డు ఈ ఒప్పందానికి ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. రుచిసోయా కూడా బాబా రాందేవ్‌ నిర్వహణలోని పంతజలి ఆయుర్వేద్‌కు చెందిన కంపెనీనే. ఖాయిలాపడి దివాలా తీసిన ఈ కంపెనీని పతంజలి గ్రూపు రెండేళ్ల క్రితం కొనుగోలు చేసింది. 


Advertisement
Advertisement
Advertisement