Rtpsలో బొగ్గు కొరత

ABN , First Publish Date - 2022-06-28T17:19:51+05:30 IST

జిల్లాలోని శక్తినగర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గు కొరత కారణంగా సోమవారం నుంచి 6 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఆర్టీపీఎస్‌

Rtpsలో బొగ్గు కొరత

                   - 6 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత 


రాయచూరు(బెంగళూరు), జూన్‌ 27: జిల్లాలోని శక్తినగర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గు కొరత కారణంగా సోమవారం నుంచి 6 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఆర్టీపీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశికాంత్‌ తెలిపారు. మొత్తం 8 యూనిట్ల ద్వారా రోజూ 1780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే వార్షిక మరమ్మతుల నేపథ్యంలో రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఈ క్రమంలో సోమవారం మరో 4 యూనిట్లలో ఉత్పిత్తిని నిలిపివేశామన్నారు. మిగతా యూనిట్లలో మొత్తం యూనిట్లకు సరిపడా బొగ్గు నిల్వలు లేనందువల్లే తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఆయన వివరించారు. కేవలం రెండు(4వ,6వ)యూనిట్లలో 325 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-06-28T17:19:51+05:30 IST