Donald Trump : 2020లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఖర్చు ఎంతో తెలుసా.. ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా బహిర్గతం..

ABN , First Publish Date - 2022-08-18T22:46:10+05:30 IST

అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండేళ్లక్రితం కుటుంబ సమేతంగా భారత సందర్శనకు(India Visit) వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సర్కార్ పె

Donald Trump : 2020లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఖర్చు ఎంతో తెలుసా.. ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా బహిర్గతం..

న్యూఢిల్లీ : అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండేళ్లక్రితం కుటుంబ సమేతంగా భారత సందర్శనకు(India Visit) వచ్చిన విషయం విధితమే. అయితే ఈ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సర్కార్ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిందనే విమర్శలున్నాయి. అయితే వాస్తవంగా ఎంత ఖర్చయ్యిందనేది బహిర్గతమైంది. ట్రంప్ 36 గంటల పర్యటనకు రూ.38 లక్షలు వ్యయం అయ్యినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. మిషాల్ భతేనా అనే వ్యక్తి ఆర్‌టీఐ(RTI ) దరఖాస్తు వివరాలు కోరగా ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ట్రంప్ సందర్శన ఖర్చు వివరాలు వెల్లడించాలని అక్టోబర్ 24,2020న మిషాల్ భతేనా తొలి దరఖాస్తు చేశాడు. దీనికి ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో నేరుగా ఆర్టీఐ(RTI) వ్యవహారాల అప్పీలేట్ అథారిటీ ‘సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్’ (Central Information Commission)ను మిషాల్ భతేనా ఆశ్రయించాడు. దీంతో ఆగస్టు 4, 2022న విదేశీ వ్యవహారాల శాఖ ట్రంప్ పర్యటన వివరాలు అందజేసింది. కొవిడ్-19 కారణంగా సకాలంలో సమాధానం ఇవ్వలేకపోయామని వివరణ ఇచ్చింది.


దేశాల అత్యున్నత నేతలు, ప్రతినిధుల పర్యటన ఖర్చులను ఆతిథ్య దేశమే భరించాల్సి ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఈ వ్యయాల భారాన్ని మోయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి బస, ఆహారం, పర్యటన రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించిందని వివరణ ఇచ్చింది. ఇందుకుగానూ రూ.38 లక్షలు ఖర్చయ్యిందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వైకే సిన్హా చెప్పారు. 


కాగా ఫిబ్రవరి 24-25, 2020 తేదీల్లో 36 గంటలపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించారు. ఆయన సతీమణి మెలానియా, కూతురు-అల్లుడు ఇవాంకా-జారెడ్ కుష్నర్‌తోపాటు అమెరికా ఉన్నతాధికారులు పలువురు ఉన్నారు. అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీల్లో  పర్యటించారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ అక్కడ 3 గంటలు గడిపారు. 22 కిలోమీటర్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమంలో మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం కొత్తగా నిర్మించిన మోతేరా క్రికెట్ స్టేడియం‌తో ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు పాల్గొన్నారు. అదే రోజు తాజ్‌మహాల్(Tajmahal) సందర్శన కోసం అహ్మదాబాద్ నుంచి ఆగ్ర చేరుకున్నారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

Updated Date - 2022-08-18T22:46:10+05:30 IST