ప్రయాణికుల కోసం ఆర్టీసీ వాటర్‌ బాటిళ్లు

ABN , First Publish Date - 2022-05-29T09:57:07+05:30 IST

ప్రయాణికులు తాగడానికి పరిశుద్ధమైన నీటిని అందించేందుకు టీఎ్‌సఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రయాణికుల కోసం ఆర్టీసీ వాటర్‌ బాటిళ్లు

బాటిళ్లకు మంచి డిజైన్‌, పేరు సూచిస్తే బహుమతి:  సజ్జనార్‌ 

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులు తాగడానికి పరిశుద్ధమైన నీటిని అందించేందుకు టీఎ్‌సఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాది మంది ప్రయాణికులను ప్రతి రోజూ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ త్వరలోనే అర లీటర్‌, లీటర్‌ పరిమాణంలో మంచి నీటి బాటిళ్లను తయారు చేయించి సరసమైన ధరలకే మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. మంచి నీటి కోసం ప్రయాణికుల నుంచి భారీగా డిమాండ్‌ ఉండడంతో అధికారులు సొంతంగా పరిశుద్ధమైన నీటిని అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువకావొచ్చని భావిస్తున్నారు. ఈ వాటర్‌ బాటిళ్లకు ఉత్తమ డిజైన్‌, ఆకర్షణీయమైన పేరును సూచించిన వారికి మంచి బహుమతి అందించనున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలను వాట్సాప్‌ నంబర్‌ 9440970000కు పంపాలని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-05-29T09:57:07+05:30 IST