పెట్రో బిజినెస్‌ వైపు ఆర్టీసీ

ABN , First Publish Date - 2020-07-03T10:16:46+05:30 IST

పెట్రోలు, డీజలు వ్యాపారంలోకి ఆర్టీసీ అడుగుపెడుతోంది. అదనపు ఆదాయం కోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించే దిశగా

పెట్రో బిజినెస్‌ వైపు ఆర్టీసీ

ఆదాయం పెంపు దిశగా అడుగులు

జిల్లాలో 8 చోట్ల పెట్రో బంకుల ఏర్పాటు


(కడప-ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజలు వ్యాపారంలోకి ఆర్టీసీ అడుగుపెడుతోంది. అదనపు ఆదాయం కోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాలను దుకాణాలకు అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇక ప్రధాన రహదారుల్లో నిరుపయోగంగా ఉన్న స్థలాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో 8 చోట్ల పెట్రోల్‌ బంకుల నిర్మాణం చేపట్టనున్నారు. రవాణా రంగంలో మార్పులు రావడంతో కొన్ని బస్టాండ్లు ప్రయాణికులు రాక నిరుపయోగంగా మారాయి.


ఈ బస్టాండ్లు ప్రధాన ప్రాంతంలో ఉండడంతో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. వాటిని ఉపయోగించుకునేందకు అక్కడ  పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. భారత్‌ పెట్రో కార్పొరేషన్‌, హిందుస్తాన్‌ పెట్రో కార్పొరేషన్‌ నేతృత్వంలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా బద్వేలు బస్టాండు, గోపవరం బస్టాండు, రైల్వేకోడూరు, నందలూరు, ముద్దనూరు, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె, ఎర్రగుంట్ల బస్టాండ్లలో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయనున్నారు.టెండర్లు పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయని ఆర్టీసీ ఆర్‌ఎం జితేంద్రనాధరెడ్డి ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - 2020-07-03T10:16:46+05:30 IST