Abn logo
Sep 26 2021 @ 23:07PM

బ్యాగును అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది

బ్యాగును అప్పగిస్తున్న ఆర్టీసీ సిబ్బంది

మైదుకూరు, సెప్టెం బరు 26: భాష తెలియని ప్రాంతం లో బస్సులో మరిచి పోయిన పాస్‌పోర్టు, విలువైన వస్తువులు న్న బ్యాగును ఆర్టీసీ సిబ్బంది అప్పగించి న ఘటన ఆదివారం మైదుకూరులో జరి గింది. ఒడిస్సా రాష్ట్రం పూరి జిల్లా వాసులు ముగ్గురు యువ కులు చెన్నై నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లాలని బస్సులో కడప చేరుకుని అక్కడినుంచి ప్రొద్దుటూరు బస్సు ఎక్కారు. మైదుకూ రులో ఓ పాస్‌పోర్టు కన్సల్టెంట్‌ కోసం దిగారు.

అయితే బస్సులో బ్యాగ్‌ మరచిపోవడంతో ఆ బ్యాగులో పాస్‌పోర్టు, విలువైన పత్రా లు, రూ. 30 వేలు నగదు ఉడండంతో భాష రాక ఇబ్బందులు పడ్డారు. అక్కడే ఉన్న ఆర్టీసీ ఏడీసీ లక్షుమయ్య వారి వివరాలు సేకరించి టికెట్‌ ఆధారంగా  అప్రమత్తం చేసి,  వారి బ్యాగును తెప్పించి డిపో అధికారులు సమక్షంలో బాధితులకు అప్పగించారు.