ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ను పెంచాలి

ABN , First Publish Date - 2021-01-25T07:06:08+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీలో మూడున్నర దశా బ్దాల పాటు పనిచేసి ఉద్యోగ విరమణచేసిన కార్మికులకు నేడు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలులోపు మాత్రమే పెన్షన్‌ వస్తుందని, ఆ సొమ్ములతో ఎలా జీవించేది అని విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు ఆదివారం అమలాపురం ఎంపీ చింతా అనురాధను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ను పెంచాలి

అమలాపురం టౌన్‌, జనవరి 24: ఏపీఎస్‌ ఆర్టీసీలో మూడున్నర దశా బ్దాల పాటు పనిచేసి ఉద్యోగ విరమణచేసిన కార్మికులకు నేడు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలులోపు మాత్రమే పెన్షన్‌ వస్తుందని, ఆ సొమ్ములతో ఎలా జీవించేది అని విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు ఆదివారం అమలాపురం ఎంపీ చింతా అనురాధను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ కంటే అతి తక్కువ పెన్షన్‌ తాము పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నామ మాత్రపు పెన్షన్‌తో జీవించలేని పరిస్థితుల్లో హోటళ్లు, ఇతర దుకాణాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వివరించారు.   దొమ్మేటి రాధాకృష్ణ, వై.ధర్మారావు, కె.నరసింహారావు, ఆర్‌.త్రినాథరావు, పీఎస్‌ నారాయణ, డీవీ భాస్కరరావు, జీవీ స్వామి, పి.కృష్ణమూర్తి, కె.రాధాకృష్ణ, ఏవీ రాము తదితరులు పాల్గొని వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2021-01-25T07:06:08+05:30 IST