Abn logo
Sep 25 2021 @ 00:31AM

దీర్ఘకాలిక లీజుకు ఆర్టీసీ స్థలాలు

వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి ఆర్‌ఎం బి.అప్పలనాయుడు

ఇన్‌చార్జి ఆర్‌ఎం బి.అప్పలనాయుడు

ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 24 : ప్రజా రవాణా శాఖ(పీటీడీ/ఆర్టీసీ)కు సంబంధించిన ఖాళీ స్థలాలను  వ్యాపారవేత్తలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం మంచి పరిణామమని, దీనవల్ల వారు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని పీటీడీ విశాఖ రీజియన్‌ ఇన్‌చార్జి ఆర్‌ఎం బి.అప్పలనాయుడు అన్నారు.  ద్వారకా కాంప్లెక్సులోని ఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఓటీ పద్ధతిలో స్థలాన్ని అభివృద్ధి చేసి వ్యాపారం నిర్వహించుకోవాలనుకుంటున్న వారికి 33 సంవత్సరాలకు గాను స్థలం అప్పగించడం జరుగుతుందన్నారు. తగరపువలసలో 4,259 చ.గ.లు, పశ్చిమగోదావరి రీజియన్‌  ఏలూరులో 12,642 చ.గ.లు, గుంటూరు రీజియన్‌లో చిలకలూరిపేటలో 3,415 చ.గ.లు, తెనాలిలో 2,500 చ.గ.లు, నరసారావుపేటలో 1,542 చ.గ.లు, బాపట్లలో 2,388 చ.గ.లు, నెల్లూరు రీజియన్‌  గూడూరులో  4,075 చ.గ.లు, అనంతపురం రీజియన్‌ హిందూపూర్‌లో 2,200 చ.గ.లు, ఉరవకొండలో 1,760 చ.గ.లు చొప్పున ఖాళీ స్థలాలు 33 సంవత్సరాల లీజుకు వ్యాపారవేత్తలకు అప్పగించేందుకు పీటీడీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందన్నారు.  ఈ సమావేశంలో  డిప్యూటీ చీఫ్‌ట్రాఫిక్‌ మేనేజర్లు కణితి వెంకటరావు(జిల్లా), ఎం.సుధాబిందు(అర్బన్‌) తదితరులు పాల్గొన్నారు.