ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలి

ABN , First Publish Date - 2022-01-20T07:21:11+05:30 IST

ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించే దిశగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ..

ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలి

 ఉప్పల్‌ జోనల్‌ వర్క్‌షా్‌పను సందర్శించిన ఎండీ సజ్జనార్‌ 

ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించే దిశగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు. బస్సు విడిభాగాల నాణ్యతా ప్రమాణాలను పెంచుతూ.. నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు సాంకేతిక నిపుణులు యత్నించాలన్నారు. బుధవారం ఆయన ఉప్పల్‌లోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షా్‌పను సందర్శించారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ.. సంస్థపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని సాంకేతిక నిపుణులకు సజ్జనార్‌ సూచించారు. ఈ సందర్భంగా వర్క్‌షా్‌పలో ఆయన ఓ మొక్క నాటారు. అలాగే, వర్క్‌షాప్‌ నుంచి ‘నేషనల్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్వాలిటీ కాన్సెప్ట్‌’ ( ఎన్‌సీక్యూసీ)లో పాల్గొని ఎక్స్‌లెన్స్‌ అవార్డు పొందిన  డీ రవీందర్‌, టీ అన్వర్‌పాషా, ఆర్‌ హరికృష్ణ, కే కరుణాకర్‌రెడ్డిలను సజ్జనార్‌ అభినందించారు.  

Updated Date - 2022-01-20T07:21:11+05:30 IST