విలీన వేదన

ABN , First Publish Date - 2022-01-21T05:08:18+05:30 IST

ఆర్టీసీ పీఆర్సీ 2021లో జరగాల్సి ఉండ గా విలీనంతో ఆగింది. ఆర్టీసీ ఉద్యోగుల 2017 పీఆర్సీకి సంబంధించి నాటి ప్రభు త్వం 2019లో 25 శాతం ఫిట్‌మెంట్‌ ప్రక టించింది.

విలీన వేదన

ఆర్టీసీ ఉద్యోగుల రోదన

 పాత స్కీంలు రావు.. కొత్తవి కనిపించవు

 ఉపయోగం లేని హెల్త్‌ కార్డు.. ఆర్టీసీ ఆసుపత్రే బెటర్‌ 

 ఎస్సార్బీఎస్‌, ఎస్‌బీటీ పథకాలు రద్దు

 చనిపోయిన ఉద్యోగులకు పరిహారం నిల్‌


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ పీఆర్సీ 2021లో జరగాల్సి ఉండ గా విలీనంతో ఆగింది. ఆర్టీసీ ఉద్యోగుల 2017 పీఆర్సీకి సంబంధించి నాటి ప్రభు త్వం 2019లో 25 శాతం ఫిట్‌మెంట్‌ ప్రక టించింది. తాజాగా ప్రభుత్వోద్యోగులకు ఫిట్‌మెంట్‌ 23.4 శాతం ఇవ్వడంతో తమ వేతనాలు తగ్గుతాయని ఉద్యోగులు కలవ రపడుతున్నారు. ప్రస్తుతం పీటీడీ, ప్రభు త్వ ఉద్యోగుల వేతనాల్లో 19 శాతం వ్యత్యా సం ఉంది. ఇది తగ్గి ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని భావిం చిన వారికి ఇది శరాఘాతంగా మారింది.  ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నన్నాళ్లు కార్మిక కు టుంబాలకు వైద్యం అందేది. ఎన్ని లక్షలు ఖర్చయినా కార్పొరేషన్‌ ద్వారా విజయవాడ ఆర్టీసీ వైద్యశాలలో ఉచితంగా వైద్యం లభించేది. ఇందుకు ప్రతి నెలా కార్మికుడు నెలకు రూ.100 చెల్లించేవాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసింది. ఆర్టీసీ విలీనం తర్వాత ప్రతి నెలా రూ.250 వసూలు చేసి ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ కార్డును జారీ చేసింది. ఇది ఎందు కూ ఉపయోగపడడం లేదని, పాత వైద్య విధానాన్నే కావాలని కోరుతున్నారు. 


కొత్త బస్సులు.. ఉద్యోగాలూ లేవు

ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నన్నాళ్లు కాలం తీరిన బస్సుల స్థానంలో కొత్తవి కొనేవారు. విలీనమైన తర్వాత ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. గడిచిన రెండేళ్లలో ఒక్క బస్సు కొనలేదు. కాలం చెల్లిన బస్సులతో ప్రమాదాలు పెరిగి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త బస్సులు రాక ఉద్యోగ నియామకాలు ఆగాయి. ఏటా జరిగే కారుణ్య నియామకాల మాట మర్చిపోయారు. కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన 12 మంది ఉద్యోగుల పిల్లలకు ఇప్పటి వరకూ కారుణ్య నియామకాలు దక్కలేదు.  


ఎన్నో కోల్పోయారు

 ఆర్టీసీ ఉద్యోగులు స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం కింద రూ.300 నుంచి 3,200 వరకూ పెన్షన్‌ పొందేవారు. ఆర్టీసీ విలీనమైన వెంటనే ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. అయితే ప్రభుత్వ పెన్షన్‌ స్కీం అమలు చేయక పోవ డంతో రెండేళ్లలో రిటైరైన 250 మంది ఎస్‌ఆర్బీఎస్‌ నుంచి వచ్చే పెన్షన్‌ పొందలేకపోతున్నారు.  ఉద్యోగులు మరణిస్తే ఎస్‌బీటీ స్కీం కింద లక్షన్నర పరిహారం ఇచ్చేవారు. ఇప్పుడది ఆగిపోయింది.  నగరాల్లో జీవించే ఉద్యోగులకు సీసీఏ కింద ప్రతి నెలా ఇచ్చే రూ.500 ఆపేశారు.


  ప్రయోజనాలన్నీ పోయాయి

– రాంబాబు, ఎంప్లాయీస్‌ యూనియన్‌

ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పెన్షన్‌ కోసం కార్మికులు బలంగా విలీనాన్ని కోరుకున్నారు. అవేవీ జరగక ఉద్యోగు లు తీవ్రంగా నష్టపోయారు. వేతనాలు పెరగలేదు. పైగా పాత పెన్షన్‌ స్కీంను రద్దు చేసి, కొత్త పెన్షన్‌ స్కీం అమలు చేయలేదు.   ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు అమలు చేయాలి.


హెల్త్‌ కార్డు నిరుపయోగం

– రాఘవులు, డ్రైవర్‌, ఏలూరు

ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డు నాలుక గీసుకోవడానికి  పనికిరావడం లేదు. ఆర్టీసీగా ఉన్నప్పుడు ఏ విధమైన అనారోగ్య సమస్య వచ్చినా పైసా ఖర్చు లేకుండా వైద్యం లభించేంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రతి నెలా రూ.100 వేసుకుని నిర్మించుకున్న మా ఆసుపత్రిలో మాకే వైద్యం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం.  


Updated Date - 2022-01-21T05:08:18+05:30 IST